చాపకింద నీరులా జనసేన

ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించడం జరిగింది. జనసేన భవిష్యత్ కార్యాచరణ పై జనసైనికులకు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. త్వరలో గ్రామ స్థాయి అధ్యక్షులు మరియు కమిటీ మెంబర్ల పేర్లు ప్రకటన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.