జనసైనికులపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకొం “ఖబర్దార్” : బోనబోయిన, గాదె

*వైస్సార్సీపీ పార్టీ దౌర్జన్యకాండ మరీ పేట్రేగిపోతుందని… ముఖ్యంగా జనసేన నాయకులు, కార్యకర్తలపై పోలీసులను అడ్డుపెట్టుకుని విధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

గుంటూరు జిల్లా, వేమూరు నియోజకవర్గం చుండూరు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు నీలం రాము, జిల్లా కార్యదర్శి చేబ్రోలు బొడయ్యని వైస్సార్సీపీ వార్డు మెంబర్లను పార్టీ మారమన్నారనే నెపంతో ఎసై ఎం.రోశయ్య తీవ్ర దుర్భాషలాడుతూ.. అరెస్ట్ చేసి ఎఫైఆర్ రాయకుండా రెండు రోజుల నుండి ఇబ్బందులకు పెడుతున్న విషయం తెలిసి చుండూరు వెళ్లారు. పోలిసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ… మా కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని కనీస మర్యాద పాటించకుండా .ఎస్సై ప్రభ్యత్వ అధికారిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎవరు పిర్యాదు చేసారని నీలం రాము అడిగితే నీకు చెప్పాలా అంటూ దురుసుగా మాట్లాడడాన్ని త్రివరంగా ఖండించారు. మొన్న జరిగిన ఆవిర్భావసభ భారీ విజయం కావడంతో అధికార పార్టీలో అలజడి మొదలయ్యిందని..భయంతోనే మా పార్టీ నాయకులపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఎస్సై “రోశయ్య” కాకి డ్రెస్ వేసుకున్న పోలీసు అధికారిలా కాకుండా వీధి రౌడీలా ప్రవరిస్తున్నాడని, ఇతని పై జిల్లా యస్పీకి పిర్యాదు చేస్తామని చెప్పారు. చుండూరు మండలంలో జనసేన పార్టీ బలం పెరుగుతుందని.. ప్రజల జనసేన వైపు ఆకర్షితులవుతున్నారని, అది చూసి తట్టుకోలేకే వైస్సార్సీపీ వారు ఈ విధంగా చేస్తున్నారని, ఇకపై ఇటువంటి పనులు చేస్తే సహించేది లేదని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. త్వరలో ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికు తీసుకెళ్తామన్నారు. అక్రమ అరెస్టులతో నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని రాష్ట్రసెక్రెటరీ బండారు రవికాంత్ అన్నారు. ఈ విషయం తెలుసుకుని వేమూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు చుండూరు పోలీస్టేషన్ కు భారీగా తరలి వచ్చి పోలీసు వారు చేసిన పనికి నిరసనగా స్టేషన్ ముందు బైఠాయించడం జరిగింది.