ప్రజాధనాన్ని వృధా చేస్తున్న పాలకులు: బొబ్బేపల్లి సురేష్ బాబు

*రాయల్ ప్యాలెస్ చీప్ లిక్కర్ మీద ఉన్న శ్రద్ధ చెత్తను సేకరించి ఎరువుల తయారి కేంద్రాల పైన ఎందుకు ఉండదు.

సర్వేపల్లి నియోజకవర్గం, కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం శంకుస్థాపనల జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు సోమవారం సర్వేపల్లి నియోజకవర్గంలో శిధిలావస్థలో ఉన్న చెత్త సేకరించి ఎరువులు తయారు చేసే యూనిట్స్ శిధిలావస్థలో ఉండటంపై ప్రజాధనాన్ని వృధా చేస్తున్న పాలకులు అని వాపోయారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చెత్తను సేకరించి ఎరువులను తయారుచేసే వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యూనిట్ ప్రారంభదశలోనే ఆగిపోయిన పరిస్థితులు మనం గమనించవచ్చు అదేవిధంగా మనుబోలు మండలం లో నేషనల్ హైవేకి ఆనుక్కొని వున్నటువంటి వర్మి కంపోస్టు యూనిట్ శిథిలావస్థలో ఉంటే అదే మండలంలో పిడురు పాలెం పంచాయతీలో 20వ తారీకు ఆదివారం రోజున కొత్త యూనిట్ ని ప్రారంభించిన సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో రెండు యూనిట్లు శిథిలావస్థలో ఉంటే ప్రజాధనాన్ని మీ ఇష్టానుసారంగా మీ స్వార్థ కాంట్రాక్టుల కోసం నేలపాలు చేస్తారా ఇకనైనా శిధిలావస్థలో ఉన్న రెండు యూనిట్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, శివరాత్రి సందీప్, రవికుమార్, అవినాష్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.