మార్కాపురంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం, స్థానిక ఎల్.ఐ.సి ఆఫీస్ వద్ద జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆదేశాల మేరకు 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీను, పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, పిచ్చయ్య, శిరిగిరి శ్రీను, మట్టం శ్రీను, జానకి రామ్, వెంకటయ్య, చందు, యశ్వంత్, దురుబేసుల శ్రీను, రామకృష్ణ, కొండలు, వెంకట్, క్రిష్ణ, చలపతి, సుబ్బారావు దుర్గరావు, వెంకట నారాయణ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.