స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలవరం జనసేన

  • స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనసేన ఆద్వర్యంలో విద్యార్దులకు ఆట వస్తువులు, నగదు బహుమతులు

పోలవరం, 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలవరం మండలం, పోలవరం హై స్కూల్ నందు పోలవరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి రాము ఆర్ధిక సాయంతో భారత మాత మరియు మదర్ తెరిస్సా విగ్రహాలకు పై కప్పు మరియు చుట్టు మెస్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిని పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు చేతుల మీద సోమవారం ఒపెన్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటానికి క్రీడల ప్రోత్సాహం చేస్తూ విద్యార్ధి విద్యార్థినిలకు 14 వేల రూపాయల విలువైన 10 బాల్ బ్యాడ్మింటన్ బ్యాట్స్ ఒక నెట్, 4 బాల్స్, త్రో బాల్స్ 4, వాలీ బాల్స్ 4, రింగ్ హైటెక్స్ 10, స్కిప్పింగ్ రోప్స్ 10,ఎయిర్ పంపు 1, షటిల్ బ్యాట్స్ 10 అందజేయడం జరిగింది. తదనంతరం ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి పరీక్షలలో స్కూల్ ప్రధమ, ద్వితీయ, తృతీయ మరియు నాల్గోవ నగదు బహుమతులు 5000, 3000,2000 మరియు 1000 రూపాయలు నగదు బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాత పోలవరం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాము. అలాగే పోలవరం జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలలో కాలేజ్ ప్రధమ, ద్వితీయ, తృతీయ, నాల్గోవ మరియు 5వ రాంక్స్ సాదించిన విద్యార్ధి విద్యార్థినిలకు నగదు బహుమతులు 5000,3000,2000,2000 మరియు 2000 రూపాయలు నగదు బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలు పోలవరం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని మరియు జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఐ.టి. విభాగం కో ఆర్డినెటర్ ఆటపాకల వెంకటేశ్వర రావు (ఏ.వి). అలాగే ఆటలపోటీలలో విజేతలకు పెన్నులు(100) అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం హై స్కూల్లో విద్యార్థులు అందరికి జనసేన పార్టీ వారు మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగక్రిష్ణ, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఐ టి విభాగం కో ఆర్డినేటర్ ఆటపాకల వెంకటేశ్వర రావు(ఏ.వి), మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, మండల ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి రాము, మండల ప్రధాన కార్యదర్శులు కాకి అయ్యప్ప, మామిడిపల్లి వరప్రసాద్, వీర మహిళ మామిడిపల్లి స్వాతి, పోలవరం మండల జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అనిశెట్టి రాదయ్య మరియు మండల కమిటీ సభ్యులు అన్ని గ్రామాల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *