బాధితులకు తగిన న్యాయం చేయలేని పక్షంలో ఉద్యమిస్తాం: ఆత్మకూరు జనసేన

ఆత్మకూరు, దేశవ్యాప్తంగా స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. 75 వసంతాల స్వతంత్రాన్ని అపహాస్యం చేస్తూ నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, పెద్ద అబ్బిపురంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. పంచాయతీకి చెందిన నిధులను దుర్వినియోగం చేశారని ప్రశ్నించినందుకు ఇమ్మిడి శెట్టి వెంగయ్య అనే రైతు పొలంలో అధికార పార్టీకి చెందిన మదాందులు 98 మామిడి చెట్లను నరికి వేయడమే కాకుండా, రెండు బోర్లను ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు దురదృష్టకరంగా రాష్ట్రవ్యాప్తంగా విష సంస్కృతి వేళ్ళూనుకుంటుంది. యధా రాజా తధా ప్రజా అన్న చందంగా నాయకుల బాటలో నడవాలి అనుకున్నాడో ఏమో, సిగ్గు ఎగ్గు లేకుండా చేసిన పనికిమాలిన పనికి నవరంద్రాలు మూసుకొని ఒక మూలన కూర్చోకుండా, అచ్చోసిన ఆంబోతులా బరితెగించి చెట్లను నరకడమే కాకుండా యదేచ్ఛగా గ్రామంలోనే తిరగడం ఎంతో విస్మయానికి గురిచేస్తుంది. పోలీస్ శాఖ వారు, ఇప్పటికైనా నిందితుని అరెస్టు చేసి విచారించి బాధితులకు తగిన న్యాయం చేయాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఈ విషయమై ఉద్యమించవలసి వస్తుందని ఈ సందర్భంగా పోలీస్ శాఖకు ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నామని తెలిపారు.