స్రవంతికి అండగా నిలచిన జనసేన

సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, నల్లమడ మండలంలోని స్రవంతి అనే బాలిక మూడు నెలల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రి వెన్నెముక సమస్యతో బాదపడుతూ.. సహాయం చేసే వారి కోసం దీన స్థితిలో ఎదురుచూస్తున్నది. అదే సమయంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం వారు స్పందించి జనసేన పార్టీ దృష్టికి తీసుకుని రావడంతో పవన్ కళ్యాణ్ స్వయానా 1,50,000 చెక్కును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా స్రవంతి కుటుంబానికి చెక్కు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతి చంద్రశేఖర్, దాసరి రామంజి, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు, కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మురళి గౌడ్, ఉపాధ్యక్షులు మంజునాథ, గోవర్ధన్, ఓం కుమార్, మహిళా ఐటీ విభాగ అధ్యక్షురాలు మణి ప్రియ, మండల అధ్యక్షులు మహేష్, నియోజకవర్గ నాయకులు డాక్టర్ పల్లపు తిరుపతేంద్ర, వంశీ, సురేందర్ నాయక్, సంతోష్ ప్రతాప్, చంద్ర, తదితర మండల నాయకులు పాల్గొన్నారు.