నారిన రమా సత్యనారాయణమూర్తి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన యుఏఈ జనసేన

  • రూపాయలు 30,000/- ఆర్ధిక సాయమందించిన యుఏఈ జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు

పి.గన్నవరం నియోజకవర్గం, యుఏఈ జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన పి.గన్నవరం నియోజకవర్గం యర్రంశెట్టి వారి పాలేనికి చెందిన నారిన రమా సత్యనారాయణ మూర్తి కుటుంబాన్ని పరామర్శించి అతని కుటుంబ సభ్యులకు యుఏఈ జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు, మొగళ్ళ చంద్రశేఖర్, కొమ్ముల వేణు, నాగ మండేల వారి ఆర్ధిక సహాయంతో 30,000 వేల రూపాయలు ఆర్థికసాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు లింగోలు పండు, జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, పి.గన్నవరం గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి తాతలు, వేమవరప్పాడు ఉప సర్పంచ్ వాకపల్లి వెంకటేశ్వరావు, కోట హనుమంతరావు, కె.ప్రసాదు, కడిమి బన్ని, బొరుసు నాని, కొమ్ముల శ్రీను, గన్నవరం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.