ఆటో డ్రైవర్ కు అండగా నిలిచిన పెనుకొండ జనసేన నాయకులు

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ మండల కేంద్రంలో మంగళవారం సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు నేతృత్వంలో మరియు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కుమార్, మండల అధ్యక్షులు యు.మహేష్ నేతృత్వంలో అంబేద్కర్ సర్కిల్ నందు సిపిఐ నాయకులు జనసేన నాయకులు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రాస్తారోకోకు సంబదించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం కొండపల్లి నుంచి పెనుకొండకు వస్తున్న ఆటో మరియు ధర్మవరంవైపు నుంచి పెనుకొండకి వెళ్తున్న కారు రైల్వే గేట్ వద్ద కొద్దిగా కారు ఆటో అతనికి గీసుకొగా కారు కొద్దిగా పెయింట్ ఎగరడంతో ఆటో డ్రైవర్ రమేష్ నాయక్ ను ధర్మవరానికి చెందిన కారు యజమాని నానా దుర్భాషలాడి నోటికొచ్చిన విధంగా కులం పేరు అడిగి మరి తిట్టడం జరిగింది. రాయలేని భాషతో కుటుంబ సభ్యులను వరుస పెట్టి దూషించడంతో రమేష్ నాయక్ తప్పు అని చెప్పినా కారు యజమానిదే తప్పు అయినా కూడా వినకుండా దూషించడంతో కొండంపల్లి నుంచి పెనుకొండకు వస్తున్న సిపిఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు జరుగుతున్న తతంగాన్ని చూసి ఇద్దరికీ నచ్చజెప్పడానికి చూడగా శ్రీరాములను కారు యజమాని చెప్పులుకాలతో తన్నడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు శ్రీరాములకు దెబ్బలు తగిలిన వెంటనే ప్రజల రెచ్చిపోయి కారులో ప్రయాణిస్తున్న కార్యక్రమాన్ని దండించడం జరిగింది. వెంటనే శ్రీరాములు మరియు రమేష్ నాయక్ జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారి ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా సోమవారం సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంకు పిలిపించి మీరు తప్పుడు ఫిర్యాదు చేశారని రమేష్ నాయక్ ను సర్కిల్ ఇన్స్పెక్టర్ దురుసుగా మాట్లాడడం జరిగింది. అందువలన మంగళవారం రోజున సిపిఐ నాయకులు, జనసేన నాయకులు కలసి రమేష్ నాయక్ శ్రీరాములకు న్యాయం జరగాలని కేసులు ఉపసంహరించుకోవాలని పోలీసుల ప్రవర్తన తీరు సరిగా లేదని కారు యజమానికి ఒక రకంగా, బాధితులకు ఒకరకంగా ప్రవర్తిస్తున్నారని నిరసన తెలియజేశారు .బాధితులకు సరైన న్యాయం జరగలేదని తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సరిగా స్పందించకపోగా అవమానపరిచారని న్యాయం జరగాలని కేసు మేము ముందు ఇస్తే మాది వెనుకకూ వేసి వెనక ఇచ్చిన కేసును మా మీద బనాయించి లేనిపోని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సిపిఐ నాయకుల యొక్క ఆరోపణ వీటిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తామని ఎస్సై వెంకటరమణ డిఎస్పి రమ్య బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని తెలపడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేష్, వెంకటేష్, బంగారం, నాగభూషణ, మల్లేష్, నారాయణ, సిపిఐ నాయకులు ఏఐటీయూసీ నాయకులు ఆటో యూనియన్ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు, మహిళా సంఘాల నాయకులు, గిరిజన జాగృతి నాయకులు, వడ్డెర సంఘం నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.