ఇతర పార్టీ సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం వేదికగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మన మేడ గురుదత్ ప్రసాద్ గురి మారింది.. ఇతర పార్టీ సీనియర్ నాయకులను, ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రెసిడెంట్ లను మర్యాదపూర్వకంగా కలవడం ద్వారా మన పార్టీ వైపు తిరిగే విధంగా నేరుగా నాయకుల ఇంటి వద్దనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి ఉద్దానం నుంచి కవులు రైతు సమస్యల వరకు చేసిన పోరాటాలు, ఆర్థిక సహాయాలు, చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు రైతు భరోసా యాత్ర ద్వారా 3,000 మందికి ఇవ్వడం వంటి అంశాలపై వారికి వివరించడమే కాకుండా రాజానగరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి చర్చించారు. నాయకులందరూ కూడా జనసేన పార్టీ గురించి సానుకూలంగానే అలానే రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలమైన శక్తిగా మార్చడానికి ఇంచార్జ్ తోడుగా ఉంటామని వాగ్దానం చేశారు. త్వరలో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున మేడ గురుదత్త ప్రసాద్ అధ్యక్షతన బలమైన క్యాడర్ తో జాయినింగ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ కన్వీనర్ మండపాక శ్రీను, కోరుకొండ మండల కమిటీ సభ్యులు, కోరుకొండ మండల జనసేన పార్టీ కార్యవర్గం, పెద్ద ఎత్తున జనసైనికులు మరియు తదితరులు పాల్గొన్నారు.