ఘనంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం

బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలంలో బుధవారం సాయంత్రం కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో చైతన్య గోదావరి బ్యాంక్ ప్రక్కన ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయంను ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించటం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి & సెంటర్లో గల జనసేన పార్టీ జెండా వద్ద జెండా వందనం చేయటం జరిగింది. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి కార్యాలయం వద్దకు వచ్చి అక్కడ (కార్యాలయం బయట) ఉన్న విఘ్నేశ్వరుడు & ఆంజనేయ స్వామి కి పూజ చేసినంతరం & కార్యాలయంను ప్రారంభించటం జరిగింది. అధికార పార్టీకి సవాలు విసిరిన గాదె వెంకటేశ్వరరావు.. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎక్కడైనా రాష్ట్రంలోని ప్రజలకు ఎదైనా సమస్యలు వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం పెట్టీ వాటి మీద చర్చించినంతరం బయటకు వచ్చి మీడియా సమక్షంలో అత్యవసర క్యాబినెట్ సమావేశం గురించి వివరిస్తారు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో దానికి పూర్తీ భిన్నంగా చేస్తున్న ముఖ్యమంత్రి. ఎక్కడైన ప్రజలు మా నమ్మకం నువ్వే అని ముఖ్యమంత్రి గురించి చెప్పుకుంటారు. కానీ మన రాష్ట్ర ప్రబుద్దుడు(ముఖ్యమంత్రి) తనకు తానే మా నమ్మకం నువ్వే జగనన్న అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవటం & పబ్లిసిటీ చేయించుకోవటం జరుగుతుంది. మన రాష్ట్రంలో అధికార పార్టీ(వైసిపి ఫ్లెక్సీలు) ఫ్లెక్సీలు తప్పా వేరే పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకోనియ్యకుండా చేస్తున్నారు & అధికార పార్టీ చేసే దుర్మార్గులపై గళం ఎత్తితే వారిపై (ప్రతిపక్ష పార్టీలు & ప్రజలు) అక్రమ కేసులు పెట్టటం జరుగుతుంది. మీరు చేస్తున్న రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రబుద్ధుడు ఇచ్చిన హామీలను 98.44% తీర్చాను అని చెబుతున్నాడు. అలాంటప్పుడు ప్రజల్లోకి రావటానికి భయం ఎందుకు. బాపట్ల నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ బలంగా ఉందని సర్వే చెబుతుంది. కావాలంటే ఉదాహరణకు బాపట్లలో గాని కర్లపాలెంలో గాని ఇప్పటికిప్పుడు సీక్రెట్ ఎలక్షన్ పెట్టండి జనసేనకు ఎన్ని ఓట్లు వస్తాయో? వైసిపికి ఎన్ని ఓట్లు వస్తాయో? చుద్దాం.. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీని గద్దె దించి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసీ కుమారి & సంయుక్త కార్యదర్శి నామన శివన్నారయణ, కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ & ఉపాధ్యక్షులు చిలకల సురేంద్రబాబు, నెల్లూరు రాజేష్, సాయి, కారుమూరి అంజనేష్, కత్తి నాగలక్ష్మి, విజయ మాధురి, బండ్రెడ్డి రజని, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం & కర్లపాలెం మండల కార్యవర్గం & జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.