ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

మార్కాపురం, “జగనన్న ఇల్లు -పేదలందరికీ కన్నీళ్లు” జనసేన పార్టీ సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలి మండలం గ్రామ ప్రాంతాల్లో పరిశీలించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ జగనన్న కాలనీలు నివాస ప్రాంతాలకు కిలోమీటర్ల దూరమని, అరకొర సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకుంటున్న పేద ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, వాటాలపై ప్రైవేట్ కంపెనీతో రాజకీయ నాయకుల ఒప్పందం చేసుకున్నారని, జగనన్న కాలనీలు సాకారం కానీ పేద ప్రజల సొంతింటి కల్, ప్రైవేటు కంపెనీలతో ఇంటి నిర్మాణం పనులు అంటే నాసిరకంకు దోహదం, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని సంచలన వ్యాఖ్యలు చేసారు.