కాపులను బీసీలలో చేర్చి కాపుల మీదున్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

కొత్తపేట: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజవర్గం రావులపాలెం మండలంలో కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కులాలను బీసీలో చేర్చాలా లేదా అన్న అంశం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పిందని కాపులను బీసీలలోకి చేర్చి కాపుల మీదున్న చిత్త శుద్ధి నిరూపించుకోవాలని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూసి రిజర్వేషన్ 10% సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా స్వాగతించిందని, ఓబీసీ రిజర్వేషన్లు గాని ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు గాని రాష్ట్రాలకు హక్కు ఉందని కేంద్రం తెలియజేయడం ఓబీసీ రిజర్వేషన్ నా పరిధిలో లేదు అని తప్పించుకోవడానికి అవకాశం లేదని కేంద్రం స్పష్టంగా తెలియజేసిందని రాష్ట్రాలకే బీసీలో మార్చే హక్కు ఉందని తెలియజేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5% రిజర్వేషన్ ఏ రకమైన కోర్ట్ ఆదేశాలు లేకపోయినా 5% రిజర్వేషన్ తొలగించారు. అటు బీసీ రిజర్వేషన్ లేకుండా ఇటు ఈ బి డబ్ల్యు సి రిజర్వేషన్ లేకుండా ఈ కాపు తెలగా బలిజం ఒంటరి కులాలకు అన్యాయం చేస్తున్నారని కాపు తెలగ బలిజ ఒంటరి కులాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులు గత కొన్ని రోజుల కిందట రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేసి కాపులకు న్యాయం చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం స్పష్టంగా చెప్పింది కాపులను బీసీలలో చేర్చే హక్కు రాష్ట్రాలకే ఉందని మీరు మీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కాపుల రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న కాపు ఒంటరి తెలగా బలిజ ఎమ్మెల్యేలు గానీ, ప్రతినిధులు గానీ, మంత్రులు గానీ, సమాధానం చెప్పాలని లేకపోతే కాపు ఒంటరి బలిజ తెలగ సంఘాలు, జేఏసీ నాయకులతో చర్చించి భవిష్యత్తులో కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షులు నందం సత్యనారాయణ, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ జక్కంపూడి వెంకటస్వామి, మండల కాపు సంఘం అధ్యక్షులు సాధన శ్రీను, మండల కాపు సంఘం సెక్రెటరీ ఆకుల భీమేశ్వర రావు, సీనియర్ నాయకులు సాధనాల సత్యనారాయణ, మర్లపాలెం సర్పంచ్ మెర్ల శ్రీరామచంద్ర మూర్తి, నందం కాశీ తదితర కాపు నాయకులు పాల్గొన్నారు.