ఇటువంటి వ్యక్తులే జనసేన పార్టీ బలం

గురువారం ఒక ఆటో డ్రైవర్ నాకు పరిచయం అయ్యాడు. వేరే ఆటో పై ఉన్న మన కళ్యాణ్ ఫోటో చూసి ఆ డ్రైవర్, ఆటో ఆయనను ఆ స్టిక్కర్ అడిగాడు ఆయన లేదు అన్నాడు. నేను ఆయనతో మీకు నేను ఇస్తా మా అన్నయ్య షాప్ దగ్గర అన్నాను. ఆయన కళ్లలో ఆనందం మరువలేనిది. నేనే స్వయంగా ఆయన అటో కి అంటించాను. ఆయన చెప్పిన మంచి మాట అందరితో ఏంటో తెలుసా మీరు కళ్యాణ్ కి డబ్బులు తీసుకోకుండా ఓటు వెయ్యండి. ఆయన మీకు డబ్బులు ఇస్తాడు అన్నారు. నాకు అయితే చాలా బాగా నచ్చారు. బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ అన్నయ్యకి ఆ వ్యక్తి ని పరిచయం చేసాను. అప్పుడు అనిపించింది ఇలాంటి వ్యక్తులే జనసేన పార్టీ బలం అని ఇలాంటి వ్యక్తుల గురించే కళ్యాణ్ చెప్పేది.