గోచిపాత్రలు తేజను పరామర్శించిన నాగబాబు

  • ఫోన్లో జనసేన పిఏసి మెంబర్ కొణిదల నాగబాబు దగదర్తి మండలంలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ పరామర్శ.
  • దళితుల పాలిటి యమపాసంలా తయారైంది వైసీపీ నాయకుల వ్యవహారం
  • 307,ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టకుండా నామమాత్రపు కేసులు పెట్టి స్టేషన్ బెయిల్స్ ఇప్పించారు. తప్పకుండా దీనిని జనసేన లీగల్ టీం తరఫున పోరాడుతాం.
  • కులం పేరుతో దూషించే కర్కోటకులు ఇంకా బతికే ఉన్నారా ఈ సమాజంలో…?

కావలి నియోజకవర్గం, దగదర్తిలో పాలిటెక్నిక్ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్న గోచిపాతల తేజ అనే దళిత యువకునిపై వైసీపీ నాయకులు ఎంపీటీసీ అయినా మహేష్ నాయుడు వారి అనుచరుల దాడిని ఖండిస్తూ నేడు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో బాధితున్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పిఏసి మెంబర్ కొణిదల నాగబాబు బాధితుడికి ఫోన్ చేసి పరామర్శించారు. జరిగిన ఈ కార్యక్రమంలో బాధితులకు అండగా మేము ఉంటామని జనసేన పార్టీ ఎప్పుడు మీకు మద్దతుగా ఉంటుందని ఎవరైనా దాడి ప్రయత్నిస్తే సహించేది లేదని జరిగిన దాడిని న్యాయపరంగా ఎదుర్కొని బాధితుడికి మద్దతుగా నిలబడతామని వారి కుటుంబాన్ని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మొన్న ముసునూరు కరుణాకర్ పై, నిన్న పైడి హర్ష, నేడు గోచిపాత్రలు తేజ దళితులపై దాడి కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అండదండలతోనే ఇవన్నీ జరగుతున్నాయా? వైసీపీ మహేష్ నాయుడు నువ్వు ఎవరో నాకు కూడా తెలియదు నా మీద కూడా దాడికి వస్తావా రా చూసుకుందాం, నా తమ్ముడు తేజకి అండగా నేనుంటాను. నాకు అండగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, నాగబాబు ఉన్నారు. ఏమయ్యా వైసిపి మహేష్ దళితులకు దళితులకు బ్రతికే హక్కు లేదా…? దళితులు బిడ్డలను కనకూడదా పుట్టుకను నీవు ఎవడులో నియంత్రించేందుకు…? ఫలానా కులంలో పుట్టాలని కోరుకోగలిగే చాయిస్ లేనప్పుడు ఒక కులానికి చెందిన దళితుడిని ఎందుకు కులం పేరుతో దూషించారు. చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్న ఒక దళితుడిపై విచక్షణారహితంగా అతని విధులకు ఆటంకం కలిగిస్తూ దళితులపై వీరంగం ఏమిటి..? ఒకరి దగ్గర పని చేసేటప్పుడు అనేక నిబంధనలు ఉంటాయి మీరు నాయకులు అందరికీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, నిజం చెప్పాలంటే మీరెవరో నాకు కూడా తెలియదు. నాయకుడు ఎవరో తెలియదు అని చెప్పడం తప్పయితే ఆ తప్పు నేను కూడా చేస్తున్నాను నువ్వు ఎవరో నాకు కూడా తెలియదు నా మీద కూడా దాడి చేస్తావా. ఈ వైసీపీ నాయకులతో మద అహంకారాలతో రగిలిపోతున్నారు ఇదే కావలి నియోజకవర్గంలో గత గత పది పదిహేను రోజుల క్రితం అక్రమంగా దళితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తే ఎమ్మార్వో ఆఫీస్ ముందరే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నించి చెన్నై హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు. మా పార్టీకి మద్దతు ఇచ్చాడని మహాసేన రాజేష్ పై దాడి జరిపిస్తారు. కష్టపడి సంపాదించుకునే వారిపై మీ దౌర్జన్యం ఏమిటి ఓట్లు వేసి గెలిపించినందుకు ఇదేనా మీరు చేసేది. పేదలు దళితులు అని చిన్నచూపు చూస్తున్నారా వారికి అండగా నేనున్నాను వారికి న్యాయం జరిగే దాకా జనసేన పార్టీ తరఫున వారి వారికి మద్దతుగా నిలబడతాం. దళితులను కులం పేరుతో దూషిస్తున్న వారికే అట్రాసిటీ కేసులు పెట్టి శిక్షించే వరకు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండి జనసేన పార్టీ తరఫున పోరాడుతాం. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో ప్రశాంత్ గౌడ్, కంథర్ బాయ్, హేమంత్ యాదవ్, చిన్న రాజా, మౌనేష్, షాజహాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.