ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన ప్రత్తిపాడు జనసేన

కాకినాడ జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంఛార్జి వరుపుల తమ్మయ్యబాబు అధ్వర్యంలో కాకినాడ మెడి కవర్ హాస్పటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు చేతులు మీదుగా ప్రారంభం చేసారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి జనసేన పార్టీ వరుపుల తమ్మయ్యబాబు అద్వర్యంలో ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్ ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో డా.అనంత్, డా.రాజేష్ లు వైద్యసేవలు అందించగా.. కార్డియాలజీ, షుగర్, బీపీ, కంటి పరీక్ష, ఈసీజీ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రెటరీ నల్లల రామకృష్ణ జాయింట్ సెక్రెటరీ దాసం శేషారావు, ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పలివెల వెంకటేష్, గంగిరెడ్ల మణికంఠ (ప్రముఖ జనసేన నాయకుల)ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ యువ నాయకులు వరుపుల సాయి కిరణ్, తూర్పు లక్ష్మీపురం జనసేన పార్టీ నాయకులు వీరంరెడ్డి దొరబాబు, లింగంపర్తి గ్రామం వల్లంరెడ్డి కొండబాబు, 3వ వార్డు మెంబర్ కుర్ర గోవింద్, 12వ వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు.