జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలని తీవ్రంగా ఖండిస్తున్నాం: కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం, వాలంటీర్లు లేకుండా సామాజిక పింఛన్లు పంచలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగుతున్నందుకు మీకు సిగ్గనిపించడం లేదా జగన్ మోహన్ రెడ్డి? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన చేయడానికి అనర్హుడువి అని ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైపోయింది. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ శాఖలకు ప్రత్యామ్నాయ వ్యవస్థలను తయారు చేస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా ఐదేళ్లు పాలన సాగించారు? వైసిపి ప్రభుత్వం విధివిధానాలలో లోపాలని సరిదిద్దే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలని జనసేన-బిజెపి-టిడిపి కూటమికి ఆపాదిస్తూ, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని శవ రాజకీయాలు చేస్తున్న వైసిపి ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా మరలా ప్రభుత్వాన్ని స్థాపించాలని దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలని తీవ్రంగా ఖండిస్తున్నాం. కోడి కత్తి, వివేకానంద రెడ్డి హత్య సంఘటనలను ఒక పథకం ప్రకారం అమలు చేసి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందిగా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విధంగానే, నేడు సామాజిక పింఛన్లు లబ్ధిదారులకి అందించలేక శవ రాజకీయాలు చేస్తూ 2024 లో అధికారంలోకి రావాలని దురుద్దేశంతో వైసిపి ప్రభుత్వం ఆడుతున్నది వికృత క్రీడా అని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఒకవైపు సామాజిక పించను లబ్ధిదారులకు పింఛను డబ్బులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు ? మరోవైపు సరైన యంత్రాంగం లేక నిస్సహాయ స్థితిలో వైసిపి ప్రభుత్వం పాలన సాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం వాలంటరీలకు నెలకు కేవలం 5000 రూపాయలు ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నది వాస్తవం కాదా? ఎందుకు మీ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో వాలంటరీలకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయారు? సమాధానం చెప్పగలరా? ఎందుకు వాలంటరీలకు వారి ప్రతిభకు, చదువుకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు? వాలంటరీలకు తీరని అన్యాయం చేసిన ద్రోహి మీరు? వాలంటరీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. వాలంటరీ సోదరులారా అర్థం చేసుకోండి వైసిపి ఆడుతున్న మైండ్ గేమ్ ట్రాప్ లో పడకండి వాస్తవాలు తెలుసుకొని ముందుకు సాగండి. దేశ చరిత్రలోనే అద్భుతమైన రాష్ట్ర సచివాలయ వ్యవస్థని నడుపుతున్నామని గొప్పలు చెప్పుకునే మీరు దాదాపు ఒక లక్ష 35 వేల సచివాలయ సిబ్బంది ఉన్నారు, దాదాపు 15 వేల సచివాలయ ఆఫీసులు ఉన్నాయి, రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల 92 వేల సామాజిక పింఛను లబ్ధిదారులు ఉన్నారు, అంటే ఒక కార్యాలయ పరిధిలోకి కేవలం 439 మంది లబ్ధిదారులు మాత్రమే ఉన్నారు, 49 మందికి ఒక సచివాలయ ఉద్యోగి చేత పింఛను అందించలేరా? సచివాలయ పరిధి కూడా కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. ఇంటింటికి పంపిణీ చేసిన కేవలం ఒకటి రెండు రోజుల్లో ముగించవచ్చు ఇది కూడా చేతకాక జనసేన-టిడిపి-బిజెపి కూటంపై నిందలు వేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశం అని స్పష్టంగా అర్థం అవుతుందని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.