సర్వేపల్లిలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శుక్రవారం కొబ్బరికాయలు కొట్టి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు యువశక్తి పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 12వ తేది చేపట్టనున్న యువశక్తి కార్యక్రమం అంజనాదేవి పుత్రుడు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో విజయవంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి యువత వలసలు పోకుండా ఉండాలంటే ఎలాంటి అభివృద్ధి జరగాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఉపాధి అందక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ నేరుగా యువతతో మాట్లాడే విధంగా, యువత యొక్క ఆలోచనలని నేరుగా తెలియజేసే విధంగా, ఒక మంచి చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయం వాట్సాప్ నెంబర్ కి 08069932222 మీ వాయిస్ రికార్డ్ ద్వారా మన గ్రామాలలో ఉన్న సమస్యలని, ఎలాంటి ప్రభుత్వం రావాలి, పరిపాలన ఏవిధంగా కొనసాగించాలి, యువత యొక్క భవిష్యత్తును ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తే బాగుంటుంది. మీరు తెలియజేసిన ఎడల వాయిస్ రికార్డ్ ద్వారా ఆ సమస్యలని విని మీకు మళ్లీ మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఆ మెసేజ్ ద్వారా మీరు అక్కడికి వెళ్లి నేరుగా మీ గళ్ళన్ని వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, అస్తోటి రవి, ముత్తుకూరు మండల నాయకులు షేక్ రహీమ్, చిన్న, నరసింహులు, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.