మళ్లీ జగనే ఎందుకు కావాలి?: గాదె వెంకటేశ్వరరావు

రేపల్లె నియోజకవర్గం: నిజాంపట్నం మండలంలొని చిన్న గ్రామమైన ముత్తుపల్లి రెడ్డిపాలెంలో రోడ్ల దుస్థితిపై స్పందించిన జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవులు అలంకరించి ప్రస్తుతం పెద్దల సభలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ పెద్దమనిషి మోపిదేవి వెంకటరమణ అనునిత్యం తిరిగే ఊరు ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే ఎందుకు కావాలి అని ప్రచారం చేసుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఈ చిన్న మురుగునీటి సమస్యని తీర్చలేని వీళ్ళు ఎందుకు మళ్ళీ కావాలో ప్రజలే ఆలోచించుకోండి అని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.