5వ రోజు దీక్షలో పాల్గొన్న చల్లపల్లి మండల జనసైనికులు

అవనిగడ్డ – కోడూరు ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ అవనిగడ్డ నియోజక వర్గ జనసేన పార్టీ చేపట్టిన రిలే నిరాహారదీక్ష 5వ రోజుకు చేరింది. ఈ రోడ్డును ఏటీఎం కార్డుగా ఉపయోగించుకుంటున్న వైసీపీ నాయకులు తాత్కాలిక మరమ్మతులు పేరుతో గతంలో 80 లక్షలు దోచుకున్న తీరు ఇంకా మర్చిపోక ముందే మరల 50 లక్షల రూపాయలతో తాత్కాలిక మరమ్మతులు చేయిస్తాము అని వైసీపీ నాయకులు చెప్పడం చూస్తుంటే దోచుకో దాచుకో రీతిలో ఈ వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని అర్దం అవుతుందని నేతలు ఆరోపించారు. జనసైనికులు గతంలో పాదయాత్ర చేసే సమయంలోనే ఈ రోడ్డుకు నిధులు మంజూరు అయినవి అని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పటి వరకు పని ఎందుకు ప్రారంభించ లేదని ప్రశ్నించారు. ఈ రోడ్డు నిర్మించే వరకు జనసేన పార్టీ విశ్రమించదని, 7 రోజుల దీక్ష అయిన తర్వాత ఏదో ఒక రూపంలో నిరసన తెలియ చేస్తూనే ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, రాష్ట్ర మత్స్య కార వికాస విభాగ కమిటీ కార్యదర్శి లంకే యుగంధర్, జిల్లా పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి లు ఉస్మాన్ షరీఫ్, పద్యాల వెంకట ప్రసాద్, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మర్రి గంగయ్య పూషడపు రత్న గోపాల్, అవనిగడ్డ టౌన్ పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు, చెన్నగిరి సత్యనారాయణ, మత్తి అజయ్, మావూరి కృష్ణయ్య, మండలి రాంగోపాల్, పవన్ కళ్యాణ్, కోసూరి అవినాష్, శ్రీ భాస్కర్, బాదర్ల లోలాక్షుడు, యక్కటి నాగరాజు, బొప్పన పృథ్వి, బచ్చు ప్రశాంత్, లక్ష్మణ, కమ్మిలి సాయి భార్గవ, రోహిత్, కమతం నరేష్, పసుపులేటి శ్రీనివాస్, కూరేటి రాఘవ, మక్కెన విజయ కుమారి, గోపాల్ రావు, నారేపాలెం శంకర్రావు, సూధాని నందగోపాల్, జితేంద్ర ముత్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.