భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుకి హామీ యాత్ర

కాకినాడ సిటి, జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుకి హామీ యాత్రా కార్యక్రమం కొండయ్యపాలెం శారదాంబ గుడి ప్రాంతంలో టి.వి.వి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారి కష్టాలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులంటే ఒక వ్యవస్థ అనీ ఇందులో రకరకాల కులాలు మతాల వారందరు పనులు చేసుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారనీ మరి నేడు అలాంటి వ్యవస్థ ఈ వై.సి.పి ప్రభుత్వ అడ్డదిడ్డమైన నిర్ణయాలతో చిన్నాభిన్నం అయిపోయి అలోలక్ష్మణా అని ఆర్తనాదాలు చేసే పరిస్థితికి వచ్చిందన్నారు. సహజంగా ఏప్రభుత్వాలైనా వివిధ రంగాలని ప్రోత్సహించే క్రమంలో ఉద్దీపనలు ప్రకటించి ముందుకు తీసుకెళ్ళతాయనీ కానీ ఈ ముఖ్యమంత్రి ఇసుక ధరలను ఆకాశానికి పెంచేసి మొత్తం జీవితాలకి సమాధి కట్టేసారని ఆక్ష్యేపించారు. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం జనసేన పార్టీ తెలుగుదేశంలు ఉమ్మడి మేనిఫెస్టోలో ఉచిత ఇసుక విధానంతో పాటుగా ముఖ్యమైన ప్రతిపాదనలు చేపడుతున్నాయని కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు నాగరాజు, కటారి శ్రీను, రవి, సుబ్బారావ్, గుర్రాల జాన్, శేఖర్ మరియు కాకినాడ సిటి జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.