చిలకలూరిపేట జనసేన ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం

ఉమ్మడి గుంటూరు జిల్లా, చిలకలూరిపేట, అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గాదె వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. శనివారం మహాశివరాత్రిని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నం అడ్డరోడ్డు సెంటర్ దగ్గర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావుకి పూలదండలు, శాలువాలతో ఘన స్వాగతం పలికిన ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్, చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. తదనంతరం అన్నదాన కార్యక్రమం స్టాల్ ను రిబ్బన్ కటింగ్ చేసిన జిల్లా అధ్యక్షులు గాదె, తదుపరి కోటప్పకొండకు వెళ్ళు భక్తులకు జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. శివరాత్రి పండుగకు ప్రజలు ఎలా అయితే సుఖసంతోషాలతో ఉంటారో అదేవిధంగా జీవితాంతం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అని తెలిపిన గాదె. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలుసు. అదేవిధంగా అధికారం లేకపోతేనే మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్న గాదె. రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన గాదె వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్, ఆముదాల లీల కిషోర్, వీర మహిళలు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.