రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ కు వినతి

  • రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేసిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: మనుబోలు మండలం గురువిందపూడి చెరువును పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనసేన పార్టీ నాయకులు, రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మాండస్ తుపాన్ కారణంగా నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి, గురువిందపూడి, ఈదగాలి గ్రామాల పరిధిలో ఉన్న 3500 ఎకరాలు నీట మునిగి పూర్తిగా నారు మొత్తం పాసిపోయి. ఇప్పటికీ కూడా ఎల్లవ తగ్గక కొంతమేరకు పొలాలు నీళ్లలోనే ఉండిపోయినటువంటి పరిస్థితులు. దీనికి కారణం ప్రధానంగా సరైన కాలవలు లేకపోవడం ఇడిమేపల్లి చెరువుకి ఎగువన ఉన్నటువంటి చెరువులన్నిటిలో ఉన్న నీళ్లన్నీ కూడా వచ్చి ఈ చెరువు మీద పడడం ప్రధాన కారణం. రెండవది నష్టపోయిన రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంటనే రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గురువిందపూడి చెరువును పరిశీలనకి రావడం జరిగింది. మరి పేరు నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగా స్పందించి రైతులని ఆదుకుంటాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు చల్ల చెంచయ్య, మలి చెంచయ్య, చంద్రశేఖర్, రహీం భాయ్, శ్రీహరి, చిన్నయ్య, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.