ప్రభుత్వం పక్షపాత ధోరణి వీడాలి: రమేష్

గురజాల: పిడుగురాళ్ళ పట్టణంలో అభివృద్ధి పేరుతో కూల్చితలు చేస్తున్నారు. పట్టణంలో రెండు కిలో మీటర్ల మేర కూల్చివేతలు చేపడితే ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా కూల్చివేస్తున్నారు. ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని రమేష్ అన్నారు. ఏ పద్దతి అవలంభించి కూల్చివేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పక్షపాత ధోరణి అవలంబిస్తూ మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. ఆభివృద్ధి పేరిట చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారని, పేదలకు ఒక రూలు సంపన్నులకు మరో రూలు పెడుతూ అధికార రాజకీయ నాయకుల ఆస్తులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు పనిచేస్తున్నారని ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. అధికారులు ఇప్పటికైనా ఎవరికీ కొమ్ము కాయకుండా కులమతాలకు అతీతంగా కూల్చివేతలు నిస్పక్షపాతంగా జరిగేలా వ్యవహరించాలని లేనిపక్షంలో ప్రజలతో కలిసి ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రజలు కానీ జనసేన పార్టీ గాని అభివృద్ధి కి వ్యతిరేకం కాదని డెవలప్మెంట్ ముసుగులో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తూ మతాల మధ్య చిచ్చు రేపే విధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపదుతున్నారని, దీనిపై పూర్తి సమాచారం సేకరించి, ప్రభుత్వ తీరును ఎండగడతామని తెలియజేశారు.