ఒంటిమిట్టలో జోరుగా కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట

  • పవనన్న ప్రజా బాట 47వ రోజు

ఒంటిమిట్ట మండల పరిధిలో పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని జనసేన వీర మహిళలు జోరుగా కొనసాగిస్తున్నారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో సాగిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 47వ రోజుకు చేరుకుంది. సోమవారం పవనన్న ప్రజా బాట కార్యక్రమములో భాగంగా ఒంటిమిట్ట మండల పరిధిలోని సాలాబాదు పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లిప్రజలను పలకరిస్తూ, జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని పవన్ కళ్యాణ్ నుముఖ్యమంత్రి చేయాలన్నారు.ఆయా ప్రాంతాల్లో సమస్యలు పరిశీలిస్తూ, ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలోపలు పార్టీలప్రభుత్వాలను చూసిన ప్రజలు మెరుగైన పాలన కోసం అవినీతి రహిత పాలన కోసం నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని జనసేన చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.