జవాన్ కు కన్నీటి నివాళి..

  • ఆర్మీ జవాన్ డి.రాజశేఖర్ భౌతికాయానికి శ్రధ్దాంజలి ఘటించిన.. జనసేన పార్టీ

జమ్మూ కాశ్మీర్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, దేవపట్లకు చెందిన ఆర్మీ జవాన్ డి.రాజశేఖర్ విధులు నిర్వహిస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. జవాన్ డి.రాజశేఖర్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గురువారం ఉదయం రాయచోటి అసెంబ్లీ ఇంచార్జ్ హాసాంబాషా షేక్, జనసేన నాయకులు రామ శ్రీనివాసులు, షేక్ రియాజ్ జవాన్ డి. రాజశేఖర్ పార్థివదేహం వద్ద పూల గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించి.. జవాన్ డి.రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జవాన్ డి.రాజశేఖర్ 12 సంవత్సరాలుగా ఐటిబిపిలో పనిచేస్తు పోలీస్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడి మృతి చెందడంతో ఆయన పార్థివదేహం స్వగ్రామానికి చేరుకుంది. అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి.

జవాన్ డి.రాజశేఖర్ పార్థివ దేహంపై జాతీయ జెండాను ఉంచి నివాళులర్పించారు. వీర జవాను తుది వీడ్కోలు పలకడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.

సంబేపల్లి మండలం, దేవపట్ల కు జవాన్ డి.రాజశేఖర్ మృత దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. జవాన్ డీ.రాజశేఖర్ పార్థివదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరు అయ్యారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *