రెనిన్యూకాలనీలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కై హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్రా కార్యక్రమం 13వ వార్డ్ రెనిన్యూకాలనీలో టి.వి.వి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోను జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారి కష్టాలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చూస్తుంటే కొద్ది కాలం గడిస్తే ఇకపై ఈ భవననిర్మాణ రంగంలో కార్మికులు ఆసక్తి చూపే పరిస్థితి లేదనీ అప్పుడు మొత్తం గందరగోళ పరిస్థితి ఎదురయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ వై.సి.పి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలవల్ల, స్వార్ధ ప్రయోజనాలకోసం ఇసక విధి విధానాల వల్ల కార్మికుల దగ్గరనుండీ వారిపై ఆధారపడి ఉన్న వివిధ రంగాలు సైతం దెబ్బతిన్నాయన్నారు. కేవలం అక్రమ సంపదన కోసం మొత్తం కార్మికుల కడుపు కొట్టిన పాపం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అందుకే భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం జనసేన పార్టీ తెలుగుదేశంలు ఉమ్మడి మేనిఫెస్టోలో ముఖ్యమైన ప్రతిపాదనలు చేపడుతున్నాయని కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు మట్టిపని కార్మికులు లోవ, కటారి శ్రీను, గుర్రాల జాన్, రత్నకిషోర్, క్రిష్ణ, రాంబాబు, పెయింటర్లు నూకరాజు, రాజు, ప్రకాష్, శ్రీనువాసు మరియు కాకినాడ సిటి జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.