తెనాలిలో జనసేనానికి ఘన స్వాగతం

  • వారాహి విజయ భేరీ సభ కోసం తెనాలి చేరుకున్న జనసేనాని

తెనాలి: వారాహి విజయ భేరీ సభ కోసం ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెనాలి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, తెనాలి నియోజక వర్గం అభ్యర్థి నాదెండ్ల మనోహర్ , గుంటూరు లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, టీడీపీ, బీజెపీ నేతలు హెలిప్యాడ్ దగ్గర స్వాగతం పలికారు.