వైఎస్సార్ సిపి నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు..

  • బత్తుల దంపతుల సమక్షంలో జనసేన పార్టీలో చేరిన వైసీపీకి చెందిన 300 కుటుంబాలు…
  • ఎన్నికలకు ముందే జనశ్రేణుల్లో నూతన ఉత్సాహం.. గెలుపే లక్ష్యంగా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న జనసేన పార్టీ
  • రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చింది వాళ్ళు(వైసీపీ)…. సొంత డబ్బులు ఇచ్చేవాళ్ళం మనం(జనసేన). రాజకీయాల్లో నాయకులకు ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం జనసేన పార్టీ పక్షాన మనం పోరాడుతుంటే.. నియోజకవర్గంలో మిగిలిఉన్న చెరువులు, కొండలు, గుట్టలు, ఇసుక, అక్రమ మైనింగ్ కోసం వైసిపి ఆరాటపడుతుంది… వైసీపీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో వైఎస్ఆర్ సీపీకి చెందిన 300 కుటుంబాలు జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో… జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, రాజకీయ ప్రయాణం నచ్చి…. అదే విధంగా అసమర్థ పాలన, అవినీతి పాలన చేస్తున్న వైసీపీ విధానాలపై విరక్తి చెంది… జనసేన పార్టీలో చేరారు, వారందరికీ బత్తుల దంపతులు జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు….

అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ… పార్టీలో చేరుతున్న వారందరికీ స్వాగతం పలుకుతూ, పార్టీలో అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విలువలు, మా నాయకత్వం నచ్చి, పార్టీలో చేరినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎవరికీ ఏ కష్టం వచ్చినా పూర్తి స్థాయిలో అందరికంటే ముందే అందుబాటులో ఉంటానని.. ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా తాను దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమని చెబుతూ.. నియోజకవర్గంలో వైసిపి వారికి భయం పట్టుకుందని.. ఈరోజు పార్టీలో చేరే వారిని అనేక విధాలుగా భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేయాలని చూసినా కార్యక్రమం ఆగలేదని.. ఈసారి ప్రజలందరూ జనసేన పార్టీకి పట్టం కట్టాలని పూర్తిస్థాయిలో నిర్ణయించుకున్నారని.. ఇప్పుడు తాత్కాలికంగా కొన్ని చేరికలు ఆపగలరు కానీ.. ప్రజల గుండెల్లో ఉన్న జనసేన పార్టీని ఆపలేరని, ఈసారి నియోజకవర్గంలో జనసేన పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందుతుందని చెబుతూ.. మండలంలోని కాలువల్లో ఉన్న పూడికలు తీయక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే పూడికలు తీయించకపోతే.. జనసైనికులే స్వచ్ఛందంగా శ్రమదానం చేయడంతో పాటు, ఎంత ఖర్చైనా వెనకాడకుండా పూడికలు తీయించి, నీరు సక్రమంగా అందేలా చేసి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.. రాజానగరం నియోజకవర్గంలో ఎవరికి భయపడాల్సిన పనిలేదని, ఇక్కడ జనసేన పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని, ప్రజలందరూ ఈసారి జనసేన పార్టీకి పట్టం కట్టాలని ఎప్పుడో నిర్ణయించుకోవడం సంతోషమని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ప్రజా పరిపాలన వస్తుందని, అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందని, జనసేన పార్టీ పేద బడుగు బలహీన వర్గాల సామాన్యులు పార్టీ అని, అన్ని వర్గాల అభ్యున్నతి జనసేన పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా అన్నారు. జనసేన పార్టీ చేరిన వారిలో అధికలు బీసీ సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాలవారు ఉన్నారు.. చేరినవారిలో నాయకులు మామిడాల సుబ్రహ్మణ్యం, లోవరాజు,వాతాడ సత్తిబాబు, బొంగు సత్తిబాబు, కంబాల నాగేంద్ర, పేదల వెంకటేష్, కవల సీతారాం, అప్పకొండ గంగారావు, షేక్ వలీ, సూరి పోసి, వొంగోరు గణేష్, గారపాటి సతీష్, సర్ధార్ సాయి వంటి నేతలతో పాటు వారి అనుచర గణం, వారి కుటుంబ సభ్యులు, జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీతానగరం మండల నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, మద్దాల ఏసుబాబు, నాగరపు సూరిబాబు, కోనే శ్రీను, రొంగలి అభిరామ్ నాయుడు, మట్ట సుబ్రహ్మణ్యం, మాధవరావు వీరభద్రరావు, ప్రగడ శ్రీహరి, మూర్తి, మట్ట పోసియ్య, బైలపూడి శ్రీను, రుద్ర నాగు, దాసరి కోటేశ్వరరావు, కమల్ గంగారం, బండి సత్యప్రసాద్, బొబ్బరాడ సూరిబాబు, సుబ్రహ్మణ్యం, కరాటపు బంగారం, దాసరి రమేష్, గడ్డం కృష్ణయ్య చౌదరి, కాండ్రేగుల పోసి రత్నాజి రావు, గోకాడ సూర్యావతి, జ్యోతి, నాతి విజయదుర్గ, విరిబోల శ్రీను, గరాపాటి శ్రీరాములు, వర్రా ఏసు, పెరుగు బాబీ, చీర్ల శివ, మిర్తిపాడు ప్రసాద్, సూరెడ్డి మణికంఠ, అంజిబాబు, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అరిగెల రామకృష్ణ, తోరాటి శ్రీను, మన్యం శ్రీను, దేవన దుర్గాప్రసాద్, తదితర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.