పేద క్రీడాకారుడికి ఆర్థిక చేయూత అందిస్తే ఎలా రాణిస్తాడో నిరూపించిన యువకుడు

షాట్ పుట్ క్రీడలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేందుకు గోవా వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన యువజన విభాగం అధ్యక్షులు డేగల రామచంద్రరావు కు తెలియజేయడంతో స్పందించిన అధ్యక్షులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన బానోతు అజయ్ గోవా వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులకు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దాని ప్రతిఫలం కారణంగానే యువకుడు గోవాలో జరిగిన జాతీయ స్థాయి షాట్ ఫుట్ క్రీడల్లో రెండు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించి సత్తాను చాటాడు. అంతేకాకుండా మలేషియా లో జరిగే ఇంటర్నేషనల్ షార్ట్ పుట్ క్రీడలకు ఎంపికయ్యాడు. గోల్డ్ మెడల్ సాధించిన వెంటనే యువజన విభాగం అధ్యక్షులు శ్రీ డేగల రామచంద్రరావుకి ఫోన్ ద్వారా తెలియజేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు & ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరి, జనసేన పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వంగా లక్ష్మణ్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు డేగల రాంచందర్ రావు, వైస్ ప్రెసిడెంట్ యాసంనేని అజయ్ కృష్ణ మరియు యువజన విభాగం మెంబెర్స్ & ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ యువ క్రీడాకారునికి శుభాకాంక్షలు తెలియజేశారు.