ప్రతి జనసైనికుడికి అండగా ఉంటా: గాదె

*పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి.. వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని.. అధికార పార్టీ బెదిరింపులకు బయపడలసిన అవసరం లేదు: గాదె వెంకటేశ్వర రావు

మాచర్ల నియోజకవర్గం.. దుర్గి మండలం కంచరగుంట గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా.. కంచరగుంట్ల గ్రామ జనసైనికులు భారీగా తరలివచ్చి గాదె వెంకటేశ్వర రావుకి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం గ్రామపర్యటనలో భాగంగా పాదయాత్ర చేశారు.. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.. జనసేన నాయకులకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని.. అడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.. నియంత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాడని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ గారిని చేయడమే లక్ష్యంగా కలసి పనిచేయాలని..అధికార పార్టీ నాయకుల తప్పులను ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేయాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులుఅడపా మణిక్యాలరావు, పులి హరి, అంబటి మల్లి, భూస రాము, హరిగల వెంకట్రామయ్య, కృష్ణ బాబు, గంధం మల్లయ్య, అచ్చరావు, మాదాసు కృష్ణ, భీమా అమరయ్య, బాల సుబ్బారావు, దుర్గారావు, శిఖా బాలు, విజయ్ జనసైనికులు పాల్గొన్నారు.