ఫిలింనగర్ వాసులకు తక్షణమే త్రాగునీరు అందించాలి.. ప్రభుత్వానికి బత్తుల డిమాండ్..

  • అత్యంత దయనీయ పరిస్థితిలో దుర్భర జీవితాలు గడుపుతున్న కాలనీవాసులు..
  • నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు, అధికార పార్టీ నేతలు..
  • బూటకపు హామీలు ఇచ్చి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు తమను గాలికి వదిలేసారని వాపోతున్న కాలనీవాసులు..
  • జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర 62వ రోజు

రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం ఫిలింనగర్ లో జరిగిన జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా శుక్రవారం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆ ప్రాంతంలో పర్యటిస్తూ వారి కష్టాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. అనంతరం మీడియాతో బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. ఇక్కడ మంచినీరు మూడు రోజులకు ఒకసారి వస్తుందని, అది కూడా పురుగులతో, నాచుపట్టి వస్తుందని.. ఇంటికి కేవలం ఒక బిందె నీరు మాత్రమే వస్తుందని.. ఈ సమస్యపై వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరికి సరైన మంచినీరు అందించాలని.. లేనిపక్షంలో జనసేన పార్టీ పక్షాన తీవ్రంగా ఉద్యమిస్తామని.. అలానే కాలనీ మొత్తం డ్రైనేజీ శుభ్రం చేయక చెడువాసనతో రకరకాల క్రిమి కీటకాలతో రక రకాల వ్యాధులకు వీళ్ళు గురవుతున్నారని, ఇక్కడ వీధిలైట్లు లేవని కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇంకుడు గుంటలు పేరుతో కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని మంచినీటి సమస్యను మాత్రం గాలికి వదిలేసారని.. ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికార వైసిపి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రాగానే పూర్తిగా వీళ్లను గాలి వదిలేసారని.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే వీళ్లను ఆదుకోవాలని, లేనిపక్షంలో వీరితో కలిసి ప్రజాపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.. ఇంటింటికి తిరుగుతూ, జనసేన కరపత్రాలు పంచుతూ. ఈసారి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇస్తేనే ఇలాంటి దుర్భర పరిస్థితుల నుండి బయటపడి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సరైన పాలన వచ్చి మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని వారిని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బద్దిరెడ్డి దొర, యర్రంశెట్టి పోలారావు, దేవన దుర్గాప్రసాద్, బత్తుల గోపాలకృష్ణ, జె. శ్రీను, రాయపాటి హరి, మిరియాల సాయి, అడబాల రవి తదితర జనశ్రేణులు పాల్గొన్నారు.