అంబేద్కర్ ఆశయ సాధన జనసేన పార్టీతోనే సాధ్యం: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, అ, ఆ లు కూడా నేర్చుకోనివ్వని ఆనాటి సమాజంలో అనేక డిగ్రీలు, పీ.హెచ్.డి లు సాధించి, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ దేశాలలో విద్యను అభ్యసించి, బ్రిటిష్ లైబ్రరీలోని పుస్తకాలన్నిటిని ఔపోసన పట్టిన ప్రపంచ జ్ఞానీగా గుర్తింపు పొందిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం‌ నేటి భారతీయ సమాజానికి దిక్సూచి అని‌ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్ గొల్లపల్లి వద్ద జనసేన పార్టీ ఆద్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ‌ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఆధునిక భారతదేశ పితామహుడు, కుల వ్యవస్థను చీల్చి చెండాడి కోటాను కోట్ల మంది జీవితాలకు వెలుగునిచ్చిన ఓటు హక్కు ప్రధాత, విద్యా, ఉద్యోగ కల్పనలో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు, ఎనిమిది గంటల పని విధానం, ప్రాజెక్టుల రూపకల్పన, ఎలక్ట్రిక్ వ్యవస్థ అనుసంధానం, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు, అనేక సంస్కరణలకు ఆద్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ‌132 సంవత్సరాల నీ జయంతి జరుపుకున్నా నేటి భారతీయులు నీ అడుగు జాడల్లో నడవాలని, యావత్ ప్రపంచ గర్వించదగిన వ్వక్తి అంబేద్కర్ అన్నారు.‌ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సూచించిన మార్గంలో‌ నడుస్తూ రాష్ట్ర ప్రజలు భవిష్యత్ ఉజ్వలంగా వుండాలని‌ కోరుకునే ఏకైక వ్వక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. ‌ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం జగదీష్, తోట కల్యాణ్, కుమార్, రెడ్డెమ్మ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.