సోషల్ మీడియా అకృత్యాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

  • పాల్వంచ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు కంప్లైంట్

పాల్వంచ: తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పోలీస్ స్టేషన్లో, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మీద మరియు వారి కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది పైశాచికంగా వ్యక్తులు, కొన్ని వెబ్సైట్లు, ప్రైవేట్ న్యూస్ ఛానల్ ద్వారా అనుచితమైన వ్యాఖ్యలు మరియు అసభ్యకరమైన పదజాల వ్యాఖ్యలు చేస్తూ, మాట్లాడుతూ వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ వెబ్సైట్లను బ్లాక్ చేయవలసిందిగా సోమవారం పాల్వంచ పోలీస్ స్టేషన్లో పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ కి ఫిర్యాదు చేయడం జరిగింది. మరియు ఆ వెబ్సైట్లను బ్లాక్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు, పాల్వంచ మండల ప్రెసిడెంట్ ఓలపల్లి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ సంపత్, కార్యదర్శి దేవ గౌడ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ బుడగం సత్యనారాయణ, ఆర్గనైజేషన్ సెక్రటరీ బాలాజీ, సోషల్ మీడియా సెక్రటరీ షేక్ బాషా, మెగాస్టార్ అభిమాని ఖాసీం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వరప్రసాద్, ప్రసాద్, రాంగోపాల్ వర్మ, పి. వీరేందర్, జనసేన కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.