ఉపాధ్యాయుల స్థానాలను భర్తీ చేయాలి: రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: అన్నమయ్య జిల్లా, రాయచోటి మండల పరిధిలోని ఏ.పి మోడల్ స్కూల్ మరియు కాలేజిలో ఇంటర్మీడియట్ “ఎం ఈ సి’ గ్రూప్ కు సంబంధించి సుమారు 40 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. వీరికి కామర్స్ సబ్జక్ట్ లెక్చరర్స్ లేక గత మూడు నెలల నుంచి సిలబస్ చెప్పేవారు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ శుక్రవారం విద్యార్థుల యొక్క సమస్యలు ప్రిన్సిపాల్ శ్రీమతి రేఖ దృష్టికి తీసుకెళ్లగా పై అధికారులకు నివేదిక పంపామని తెలియజేశారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటువంటివి పలు రకాల సమస్యలు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఏ.పి మోడల్ స్కూలల్లో మరియు కాలేజీలల్లో అలానే కస్తూరిబా స్కూల్ టీచర్లు, లెక్చలర్ల కొరత సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ.. సంబంధిత శాఖ ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్, కాలేజీలకు చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థుల యొక్క సమస్యలను యుద్ధప్రాతిపదికన టీచర్ల కొరతను పరిగణలోకి తీసుకుని వెంటనే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలని జనసేన పార్టీ తరపున విద్యాశాఖ మంత్రికి మరియు వైసీపీ అగ్రనాయకత్వానికి హెచ్చరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ, స్థానిక పార్టీ నాయకులు రియాజ్, షబ్బీర్ అలీ, శ్రీకాంత్, నాగరాజ, శ్రీను చరణ్, జనసైనికులు పాల్గొన్నారు.