జనసేన క్రియాశీలక సభ్యత్వం అంటేనే ఆ కుటుంబానికి ఒక భరోసా: గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, చల్లా వారి పాలెం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త బిల్లూరి ప్రసన్నకుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రసన్నకుమార్ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్నందున ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం నియోజకవర్గం నాయకులు చట్టాల త్రినాధ్, మరియు గ్రామ నాయకులు సుధా పిచ్చయ్య, లీలా కుమార్ లను అడిగి పూర్తి సమాచారం తీసుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, గాయపడిన కార్యకర్త యొక్క కుటుంబానికి 50వేల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకు పంపించి వారికి అందజేయవలసినదిగా సూచించారు.. ఈ మేరకు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలసి ప్రసన్నకుమార్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా బిల్లూరు ప్రసన్నకుమార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలిపి వారికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసి పవన్ కళ్యాణ్ గారు పంపిన చెక్కుని వారికి అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా బిల్లూరి ప్రసన్నకుమార్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పార్టి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తమకు చేసిన సహాయం మర్చిపోలేనిది అని తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయుబ్ కమల్, మార్కండేయ బాబు, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, చట్టాల త్రినాధ్, సిరిగిరి శ్రీనివాసరావు, కొర్రపాటి నాగేశ్వరావు, శిఖా బాలు, వల్లెం శ్రీను, మధులాల్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు సుధా పిచ్చయ్య, సిరిగిరి వెంకట్రావు, నాగభూషణం, కొమ్మ గిరి, లీలా కుమార్ మరియు జన సైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు పాల్గొన్నారు.