జీవీఎంసీ 85వ వార్డులో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

గాజువాక: జనసైనికులకు అండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం జీవీఎంసీ 85వ వార్డులో చేరిన బొర్రమాంబ, ఉప్పర కాలనీలో గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర రావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రెక్కాడితే కానీ డొక్కాడని వారు కూడా జనసేన పార్టీ కోసం పనిచేయాలని ఉత్సాహంతో క్రియాశీలక సభ్యులుగా చేరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సీనియర్ నాయకులు నక్క గోవింద్, దయాకర్, హరి బాబు, అశోక్, కృప, కిషోర్, ఎస్ ప్రసాద్, మురళీకృష్ణ, గోపి కృష్ణ, గణేష్, సింహాద్రి, కృష్ణ, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.