క్రియాశీలక సభ్యత్వం ‘జనసైన్యానికి’ భద్రమైన భవితవ్యం: గర్భాన

  • క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రామాన్ని ప్రారంభించిన గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో
క్రియాశీలక వాలంటీర్లు సీతంపేట మండలాధ్యక్షుడు, వాలంటీర్ మండంగి విశ్వనాథం, భామిని మండల వాలంటీర్ కిల్లర్ ప్రమోద్ లకు సోమవారం పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందజేయడం జరిగింది. ఈ మేరకు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను మరియు పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలను ప్రజల వద్దకు వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి అని ఆయన దిశా నిర్దేశం చేసారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబానికి ఇన్స్యూరెన్స్ అందించి భరోసా కల్పిస్తుంది ఈ ‘క్రియాశీలక సభ్యత్వం’. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల భీమా కుటుంబ సభ్యులకు అందించి ఆదుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే 50000/- ఆరోగ్య భీమా అందిస్తారు. జనసైనికులు, వీరమహిళలు మన క్షేమం కాంక్షించే జనసేనాని ఆలోచనను అందుకొని ఆ దిశగా అడుగులు వేయాలని ప్రియమైన జన సైన్యం కోసం “క్రియాశీలక సభ్యత్వం”. ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు ప్రజల్లోకి వెళ్లి జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతాలు వివరిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి మీ వంతు భాధ్యత నిర్వహించాలని, రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు హక్కును వేసి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు తెలియచేసారు.