క్రియాశీలక కార్యకర్తలే జనసేన బలం

* పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
* ఒక్కొక్కరు పదిమందితో ఓటు వేయించేలా పనిచేయాలి
* అధ్యక్షులవారు లేవనెత్తిన అంశాలను ప్రజలకు వివరించండి
* జగన్ రెడ్డిని గద్దె దించాలంటే మనందరం కలిసికట్టుగా పని చేయాలి
* ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు

జనసేన పార్టీ సిద్ధాంతాలు, చేస్తున్న సేవా కార్యక్రమాలు, అధ్యక్షుల వారి భావజాలాన్ని ప్రతి ఒక్క క్రీయాశీలక కార్యకర్త తమ గ్రామాల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు కోరారు. ఒక్కొక్క క్రీయాశీలక సభ్యుడు పదిమంది తటస్థ ఓటర్లతో పార్టీకి ఓటు వేయించేలా పనిచేయాలన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడుతూనే… జగన్ అరాచక పాలనను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. శనివారం తిరుపతి నగరంలో జీడీ నెల్లూరు, మదనపల్లి, చంద్రగిరి, సత్యవేడు, నగిరి నియోజకవర్గాల జనసేన నాయకులు, క్రియాశీలక కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యచరణపై క్రియాశీలక కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తేనే రాష్ట్ర అభివృద్ధి అధ:పాతాళంలోకి పడిపోయింది. మరోసారి అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులను బలవంతంగా లాక్కొని బ్యాంకుల్లో తాకట్టు పెడతాడు. జగన్ అరాచకపాలనకు చరమగీతం పాడి, అధికార పీఠం నుంచి గద్దె దించాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి.
* అధ్యక్షుల వారి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లండి
జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే బలమైన లక్ష్యంతో మొదలైన వారాహి విజయ యాత్ర తొలి మూడు విడతలు దిగ్విజయంగా ముగిశాయి. ప్రభుత్వ అవినీతి, దౌర్జన్యపాలన, వాలంటీర్ల వ్యవస్థ అరాచకాలను ప్రజాక్షేత్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎండగట్టారు. త్వరలోనే నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో మొదలు కానుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మనవంతుగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో చేస్తున్న ప్రసంగాలను, ఆయన ఆలోచనల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి, కాన్ ప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. హరిప్రసాద్, జనసేన పార్టీ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ కలికొండ శశిధర్, జిల్లా ముఖ్యనేతలు, క్రీయాశీలక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* శ్రీ నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేతలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వెళ్లిన నాగబాబు గారిని ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబు గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాలతో సత్కరించారు. అనంతరం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని ప్రతిమను బహుకరించారు. నాగబాబు గారిని కలిసిన వారిలో టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సుగుణమ్మ, తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, సీనియర్ నాయకులు మునికృష్ణ, ఉకా విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.