మంగళగిరిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

  • ప్రతి కార్యకర్తకి జనసేన పార్టీ అండగా ఉంటుంది
  • క్రియాశీలక సభ్యత్వ వాలంటరీలను సన్మానించిన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆదివారం క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో వాలంటరీలుగా బాధ్యతలు నిర్వహించిన వారి కృషికి గుర్తింపుగా క్రియాశీలక వాలంటరీలకు సన్మానం మరియు క్రియాశీలక కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం క్రియాశీలక వాలంటరీలను సన్మానించి వారి కృషికి గుర్తుగా మెమెంటో ఇవ్వడం జరిగింది. అలాగే క్రియాశీలక కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముందుగా మంగళగిరి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన వాలంటరీలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా 6000 పైచిలుకు సభ్యతాలను నమోదు చేసి గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గం 2వ స్థానంలో ఉందని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, వారి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. మన మంగళగిరి నియోజకవర్గంలోనే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకున్న మీడియా ప్రతినిధి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును కొంతకాలం క్రితం కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులకు పార్టీ తరపున వారికి అండగా ఉండాలని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించడం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అలాగే జనసేన అభ్యర్థి ఎవరు ఉన్నా సరే పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా కార్యదర్శి రావిరమా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె ఎస్ ఆర్), మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు మరియు ఎంటిఎంసీ సమన్వయ కమిటీ సభ్యులు తిరుమలశెట్టి కొండలరావు, ఎంటిఎంసీ ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, ఎంటిఎంసీ కార్యదర్శులు తిరుమలశెట్టి మురళీకృష్ణ, బళ్ళ ఉమామహేశ్వరరావు, మంగళగిరి, తాడేపల్లి మండల కమిటీ సభ్యులు, క్రియాశీలక వాలంటరీలు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.