తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన నటుడు రామ్ చరణ్: తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 39వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు కొబ్బరి బొండం మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలో నడుస్తూ ఎంతోమంది అభిమానులకు ఆదర్శంగా నిలిచిన నటుడు రామ్ చరణ్ ని భవిష్యత్తులో రామ్ చరణ్ చేపట్టిన సేవా కార్యక్రమాలు అయినా, కొత్త సినిమాలైనా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, రషీద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.