పాడేరులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవం పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా వంపురు గంగులయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఆదివాసీ అమరవీరులకు నివాళులు అర్పించి.. ఆ మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక ఆదివాసీ తమజాతి మనుగడ కాపాడవలిసినటువంటి అవసరాన్ని గుర్తించి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలని.. నేటి యువతరం రాజకీయాలలో సైతం ప్రధాన భూమిక పోషించి మనకు గల రాజ్యాంగ పరమైనహక్కులు, చట్టాలు, పరిరక్షించ వలిసిందిగా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై పాడేరు, జి.మాడుగుల చింతపల్లి, మండలాలకు చెందిన అనేకమంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య చేతుల మీదు కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు. వారిని సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించడమైనది. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, ఉపాధ్యక్షులుసాలేబు అశోక్, నాయడు, బలిజ కోటేశ్వరరావు (హుకుమాపేట), జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, చింతపల్లి నాయకులు బుజ్జి బాబు, పండు, రవి, వివిధ మండలాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.