ఏపీ ప్రభుత్వంతో ‘మైక్రోసాఫ్ట్’తో ఒప్పందం

Skills Development with Microsoft in AP: ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉపాధి అవకాశాల పెంపులో భాగంగా కీలక అడుగుపడింది. యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు మొట్టమొదటి సారిగా ఐ.టీ దిగ్గజ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ తో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధించి యువతలో స్కిల్స్ డెవలప్ చేసేందుకు ఏపీ శిక్షణా విద్యా శాఖ – మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక మీదట కీలక భాగస్వాములు కాబోతున్నాయి. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ తొలిసారిగా ‘మైక్రోసాఫ్ట్’తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ యువత భవితను మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తున్న ముందడుగు అంటూ దీనిని అభివర్ణించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరినట్లు రాష్ట్రంలో 1,62,000 వేల మంది యువతకు శిక్షణ నిచ్చి , వారిని నిఫుణులుగా మార్చి ధృవపత్రాల అందజేతకు ‘మైక్రోసాఫ్ట్’ అంగీకారం తెలిపిందని మంత్రి అమరావతిలో వెల్లడించారు.