మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వ్యవసాయం అతలాకుతలం: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మిచౌంగ్‌ తుఫాన్‌ ఉభయగోదావరి జిల్లాలను అతలాకుతలం చేసిందనీ మూడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన తుఫాన్‌, తీరం దాటే వేళ పెను విధ్వంసాన్నే సృష్టించిందనీ తుఫాన్‌ ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారిందని అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడ్డాయనీ భారీవర్షాలు, ఈదురు గాలులతో కోస్తా జిల్లాలు చిగురుటాకులా వణికాయనీ ఈ తుఫాన్ కురిసిన వర్షాలకు లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయనీ అంతే కాకుండా పెనుగాలులకు వర్షాలు తోడవడంతో మిచౌంగ్‌ ప్రళయాన్ని తలపించిందని, ఈ తూఫాన్ వల్ల ప్రతి రైతు నష్టపోయాడని తాడేపల్లిగూడెం మండలం పుల్లయిగూడెం మరియు అప్పరావుపేట గ్రామాలలో తూఫాన్ వల్ల మునిగిపోయి దెబ్బతిన్న పంట పొలాలను సమీక్షించి రైతులతో మాట్లాడినప్పుడు వారి బాధ అతీతం అని, రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం, ఈదురు గాలులతో సాగులో ఉన్న మినుము, వరి, మొక్కజొన్న పైర్లు నెలకొరిగాయని దీంతో లక్షల రూపాయలు పెట్టు బడి నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోయరు, కంటికి రెప్పలా కాపాడుకున్న కళ్లముందే నీటి పాలయ్యాయనీ, వైసీపీ ప్రభుత్వం తుఫాన్ వల్ల ఎదురయ్యే సమస్యల గురించి రెండు రోజుల ముందు జిల్లా కలెక్టర్లతో మీటింగ్లు పెట్టారు తప్ప సహాయక చర్యలు ఆచరణలో పెట్టలేదన్నారు, క‌నీసం స‌మీక్షించ‌క‌పోవ‌డం దారుణం అన్నారు. తుపాను పై అప్రమ‌త్తం చేయ‌డంలోనూ, స‌హాయ‌క‌చ‌ర్యలు చేప‌ట్టడంలోనూ ప్రభుత్వం విఫ‌లం అయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో ప్రజ‌లు త‌మ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు, అనేక చోట్ల ప్రజలు ఇంకా వ‌ర‌ద ప్రాంతాల్లో గ‌డుపుతున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ విప‌త్తు వ‌చ్చినా, జనసేన అధికారంలో లేకున్నా మాన‌వ‌తాదృక్పథంతో జనసేన శ్రేణులు, తుపాను స‌హాయ‌క‌చ‌ర్యల‌లో పాల్గొని ప్రజలకు దగ్గరగా ఉన్నారని ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విపత్తు సమయంలో మీనమేషాలు లెక్కించకుండా యుద్ధ ప్రాతిపదికన ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను మానవత దృక్పథంతో ఆదుకొని తక్షణ సాయం కింద ఎకరానికి 20000 అందించాలని బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.