ఘనంగా దగ్గుపాటి వెంకట ప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ నామినేషన్

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన – టిడిపి – బిజెపి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకట ప్రసాద్, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ బుధవారం నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి, టిడిపి నాయకులు కార్యకర్తలు అశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అశేషంగా తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు జనసేన, టిడిపి, బిజెపి నాయకులకు కార్యకర్తలకు మరియు అనంతపురం పట్టణ ప్రజలకు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ధన్యవాదాలు తెలియజేసారు.