జనసేనానికి పాలాభిషేకం చేసిన ఆలమూరు జనసైన్యం

*కౌలు రైతు కన్నీళ్లు తుడిచే నాయకుడు ఒక జనసేనాని మాత్రమే!

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, ఆలమూరు మండలంలోని, ఆలమూరు టౌన్ నందు జనసేనాని చిత్రపటానికి పూలతో అలంకరించి, భారీ ఎత్తున జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పాలాభిషేకం ఘనంగా నిర్వహించి యున్నారు. కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో వారి పిలుపు మేరకు బుధవారం ఆలమూరు బస్టాండ్ సెంటర్ నందు జనసేనాని కౌలురైతులకు చేసే సాయానికి సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తూ పలువురు జనసైనికులు పాలాభిషేకం ఎంతో ఘనంగా జరిపించారు. జనసేనానిలో ఉన్న మానవత్వం ఎంతో విలువైనదని, ఆర్థిక ఇబ్బందులతో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను వారి బిడ్డలను, ఎంతో ప్రేమతో ఆదుకోవాలనే మంచి తలంపుతో, ఉన్నత విద్యలను చదివించాలని, ఒక ప్రత్యేకమైన సంక్షేమ నిధిని తక్షణం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకునే నాయకుడిని, ఇంతవరకూ చూడలేదని, ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసే నాయకుడంటే ఒక జనసేనాని మాత్రమేనని, ఇలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరూ.. రానున్న రోజుల్లో కాపాడుకుని రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టుకోవాలని, ప్రజల్లో మార్పు ఎంతో వచ్చిందని, ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించగల సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని, ఎంతమంది ఎన్ని రకాలుగా అధికారంలోకి వచ్చినా, ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నాయకులను ఇక నమ్మకూడదని, తాను సంపాదించిన కష్టార్జితాన్ని అనేక సేవా కార్యక్రమాలతో నిరంతరం ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు పెడుతూ.. ప్రజల హృదయాలలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడుని ఒక్కసారైనా ముఖ్యమంత్రి చేయాలని కోరారు. పలువురు జనసేనాని తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్ర పూర్తిస్థాయిలో దిగ్విజయం గా ముందుకు సాగాలని, జనసేనానిని దీవిస్తూ.. ఆశీర్వదిస్తూ పలువురు మాట్లాడుతూ.. జనసేనానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి, తాళ్ల డేవిడ్ రాజు మరియు బైరి శెట్టి రాంబాబు ఆధ్వర్యంలో, కట్టా రాజు ఆలమూరు గ్రామ అధ్యక్షులు, చల్లా వెంకటేశ్వరరావు, శిరిగినీడి పట్టాబి, దాసి మోహన్, కొండేపూడి వరప్రసాద్, పసుపులేటి సాయి బాబా, లంకే దాన కృష్ణ, కొప్పాడి జైరాజ్, షేక్ బాబ్జి, కోటా వరలక్ష్మి, కొండేటి హేమాదేవి, కొండేపూడి స్వర్ణలత, పలువురు జనసైనికులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.