పవనన్న ప్రజాబాటతో జనంలోకి దూసుకెళ్తున్న ఆత్మకూరు జనసేన

  • పవనన్న ప్రజాబాట 39వ రోజు

ఆత్మకూరు: పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 39వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, సత్తెనపల్లిలో కుమారుని మృతితో ప్రభుత్వం నుంచి తురక గంగమ్మ కుటుంబానికి వచ్చిన పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు గారు వాటా అడిగిన వ్యవహారం అత్యంత దుర్మార్గమని తెలియజేశారు. అవినీతి మంత్రి అంబటి తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మేదర వీధి, గర్ల్స్ హైస్కూల్, కృష్ణ మందిరం ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ పవనన్న ప్రజాబాట సాగింది. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా డ్రైనేజీ సౌకర్యం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, సురేంద్ర, నాగరాజు, భాను, ఆనంద్, రాజా, హజరత్ తదితరులు పాల్గొన్నారు.