ఛలో టీటీడీ పరిపాలన భవనముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష పార్టీలు

  • టీటీడీ పరిపాలన భవనం ముందు అఖిలపక్ష నేతల ధర్నా
  • తిరుమల పవిత్రతను కాపాడుదామంటూ పెద్ద ఎత్తున నినాదాలు
  • శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి – అఖిలపక్ష నేతలు
  • టిడిపి నేతలు సుగుణమ్మ & నరసింహయాదవ్ మాట్లాడుతూ ఆనంద నిలయంలోకి సెల్ ఫోన్ ను తీసుకెళ్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు.
  • వరుసగా జరిగే ఘటనలను చూస్తుంటే తిరుమలపై కుట్రలు పన్నుతున్నారనే అనిపిస్తుంది
  • ఇంత నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న భద్రతా సిబ్బందిని వెంటనే తొలగించాలి

తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడుదామంటూ బుధవారం టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద అఖిలపక్ష పార్టీలు, స్థానిక శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు హరిప్రసాద్ & కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వరుసగా జరుగుతున్న నిఘా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై తిరుపతిలో రాజకీయ పార్టీలన్నీ ఏకమయ్యాయని తెలియజేయసారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మొన్న డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించారు, వెంటనే హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం, నిన్న సాక్షాత్తు ఆనంద నిలయంలో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాలలో పెడుతుంటే టీటీడీ పాలకమండలి, చైర్మన్, ఈవో, భద్రతా సిబ్బంది మొద్దు నిద్ర పోతున్నారా అని, పదేపదే వరుసగా ఇలాంటి ఘటనలను చూస్తుంటే దీని వెనక ఏదైనా కుట్రలు ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయని, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పాలకమండలి వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని, తిరుమల ఆగమన శాస్త్రం ప్రకారం నడుచుకోనియెడల, టీటీడీ పవిత్రతను దెబ్బతీయాలని కుట్రలు పన్నిన శ్రీవారి భక్తులుగా మేము దేనికైనా సిద్ధమని, టీటీడీ బోర్డు పరిపాలకులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్ష నేతలు శ్రీవారి భక్తులతో కలిసి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బుల్లెట్ రమణ, ఆర్.సి మునికృష్ణ, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ధంపురి భాస్కర్, జనాసేన నాయకులు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుభాషిని, కీర్తన, లక్మి, రాజేష్ ఆచారి, రాజమోహన్, హేమంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శివశంకర్ మరియు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.