పెన్షన్ డబ్బులు బ్యాంక్ ద్వారా చెల్లించి, పోస్టల్ మోసాలను అరికట్టాలి

నిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కొరుతూ రాజస్వ మండల అధికారి RDO భైంసాకి సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ క్రింది డిమాండ్స్ ను నెరవేర్చాలని వినతిపత్రంలో తెలపడం జరిగింది.

*పెన్షన్ డబ్బులు బ్యాంక్ ద్వారా చెల్లించి, పోస్టల్ మోసాలను అరికట్టాలి.
*ప్రతి కార్యాలయంలో ర్యాంపులని నిర్మించాలి.
*40శాతం వున్న వికలాంగులందరికి ఆర్టీసి బస్ పాస్ లో రాయితీ ఇవ్వాలి.
*కేంద్ర ప్రభుత్వ UDID గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి.
*ప్రతి వికలాంగుని కుటుంబంలో ఉపాధి హామీ కూలి డబ్బులను చెల్లించాలి.
*పట్టణంలోని వికలాంగులందరికీ ఉపాధి హామీ పథకంలా ఉపాధి కల్పించి ఆదుకోవాలి.
*వికలాంగులకు వివాహ పరిచయ వేదిక ప్రభుత్వమే నిర్వహించాలి.
*3016 రూపాయల పెన్షన్ ను 6000 రూపాయలకు పెంచాలని
తదితర డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగులు బి.రాజు, భోజరెడ్డి, యశ్వంత్, పర్మేష్, తదితరులు పాల్గొన్నారు.