జనసేన పార్టీ వేసే అడుగుల్లో ప్రజలందరూ కూడా అడుగులు వేసి అండగా ఉండాలి

సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కప్పల దోరువు పంచాయతీ వల్లూరు గ్రామం నందు 15వ రోజు మంగళవారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికే రెండు ప్రభుత్వాలు పరిపాలన కొనసాగించాయి అయినా వైద్యం కావాలంటే పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి, ఉన్నత విద్యలు కావాలంటే పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి, కాంట్రాక్టు పని చేసుకోవాలంటే పక్క రాష్ట్రానికి వెళ్లేటువంటి పరిస్థితి, మంచి ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి, అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ సామాన్యులకి పేదలకి అవసరమైనటువంటి విద్యా, వైద్యం, ఉద్యోగం వీటన్నిటిని ఉచితంగా పేదవాళ్ళకి అందించే పరిస్థితిలో లేని ప్రభుత్వాలు వస్తున్నాయి గాని స్వచ్ఛంగా పేదవాడికి కావలసిన వసతులను అందించేటువంటి ప్రభుత్వాలు ఇప్పటివరకు రాలేదు రేపు రాబోయే ఎన్నికల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన పరిపాలనలో రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర అభివృద్ధి, పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూర్చే విధంగా పరిపాలన ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈసారి పవన్ కళ్యాణ్ కి అవకాశాన్ని కల్పించి ఆయన్ని ఆదరిస్తారని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటు అదే విధంగా ఈ అరాచకపు పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తిని చేసేదానికోసం జనసేన పార్టీ వేసే అడుగుల్లో ప్రజలందరూ కూడా అడుగులు వేసి అండగా ఉంటారని కోరుకుంటున్నామని మీ అందరి సహకారంతో కొత్త విధానాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనే విధానాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నవీన్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అక్బర్, శ్రీహరి, రహమాన్, తేజ, సూహిల్, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.